Share News

హెచఐవీపై కళా బృందాలతో అవగాహన

ABN , Publish Date - May 15 , 2025 | 12:31 AM

జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్‌ నివారణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో హెచఐవీపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన కళాజాతాను అదనపు డీఎంహెచవో ఎల్‌.భాస్కర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

హెచఐవీపై కళా బృందాలతో అవగాహన
కళాజాతాను ప్రారంభిస్తున్న అదనపు డీఎంహెచవో ఎల్‌.భాస్కర్‌

అదనపు డీఎంహెచవో ఎల్‌.భాస్కర్‌

కర్నూలు హాస్పిటల్‌, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్‌ నివారణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో హెచఐవీపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన కళాజాతాను అదనపు డీఎంహెచవో ఎల్‌.భాస్కర్‌ జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అదనపు డీఎంహెచవో మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన హెచఐవీ ప్రభావిత ప్రాంతాల్లో 20 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు హెచఐవీపై ఉన్న అపోహలను, చికిత్స విధానాన్ని వివరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఎనజీవోలు, ఆరోగ్య సిబ్బంది, డీఆర్‌డీఏ, డీడబ్లూఎంఏ, ఐసీడీఎస్‌ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎయిడ్స్‌ నియంత్రణ క్లస్టర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ వెంకట రత్నం, నేస్తం పాజిటివ్‌ నెట్‌వర్క్‌ అధ్యక్షురాలు సుధారాణి, నాగరాజు, లింకు వర్కర్‌ స్కీం డీఆర్‌పీ నాగరాజు, ఎస్‌ఆర్‌ఈడీ, వీఎంఎం సంస్థల ప్రాజెక్టు మేనేజర్లు మునీర్‌, విజయ పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:31 AM