వ్యాధుల నియంత్రణపై అవగాహన
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:55 PM
: పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.వెంకటరమణ ఆధ్వర్యంలో కీటకజనిత వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించారు.
నంద్యాల హాస్పిటల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.వెంకటరమణ ఆధ్వర్యంలో కీటకజనిత వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు దోమకాటు వల్ల వస్తాయని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు దోమకాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమకాటువల్ల కలిగే ప్రాణహాని గురించి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో డా.శారదాబాయి, మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.నిరంజన్, జిల్లా మలేరియా అధికారి సి.చంద్రశేఖర్, సహాయ అధికారి కె.సత్య నారాయణ, సిబ్బంది జిల్లాలోని సబ్ యూనిట్ అధికారులు, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.