Share News

నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:56 AM

నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని కర్నూలు డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు.

నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి
కళ్లను డీఎంహెచవోకు అందజేస్తున్న డాక్టర్‌ సుధాకర్‌ రావు

డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని కర్నూలు డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు. సుశీల నేత్రాలయ ఐ డోనేషన సెంటరులో మొట్టమొదటిసారిగా నగరంలోని కింగ్‌ మార్కెట్‌లో గుండెపోటుకు మరణించిన 72 ఏళ్ల జయలక్ష్మి నుంచి నేత్రాలను సేకరించారు. శనివా రం ఉదయం సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్‌ పి.సుధాకర్‌రావు సేకరించిన నేత్రాలను డీఎంహెచ వోకు అందజే శారు. డీఎంహెచవో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీకి నేత్రాల సేకరణకు అనుమతి ఉందని, కొత్తగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సుశీల నేత్రాలయ అండ్‌ మెటర్నిటి హాస్పిటల్‌కు ఐ డొనేషన సెంటర్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మరణానంతరం 6 నుంచి 12 గంటల వరకు నేత్రాలను దానం చేయవచ్చునన్నారు. నేత్రదానానికి సహకరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను డీఎంహెచవో అభినందించారు. నేత్రాలను దానం చేయాల్సిన వారు సుశీల నేత్రాలయ ఐ డోనేషన సెంటర్‌ 8886306308 నెంబర్‌కు ఫోన చేయాలన్నారు. డాక్టర్‌ పి.సు ధాకర్‌రావు మాట్లాడుతూ సేకరించిన కళ్లను సికింద్రాబాదు వాసన ఐ బ్యాంకులో పంపించామన్నారు. హాస్పిటల్‌లో కళ్లను స్టోరేజ్‌ చేయ డానికి అన్ని వసతులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్నియా స్పెషలిస్టు డాక్టరు రాఘవ్‌ ప్రీతమ్‌, రెటినా స్పెషలిస్టు డాక్టరు నేహ సుధాకర్‌, అకినోప్లాస్టి స్పెషలిస్టు డా.నేహఘోష్‌, గైనకాలజిస్టు సావిత్రి, గ్లకోమా స్పెషలిస్టు విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:56 AM