Share News

నేత్రదానంపై అవగాహన

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:24 AM

జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని శనివారం స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

నేత్రదానంపై అవగాహన
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి

కర్నూలు ఎడ్యుకేషన, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని శనివారం స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్‌ సంధ్యారెడ్డి మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల న్నారు. ఒక వ్యక్తి చనిపోయిన సమయం నుంచి 6 గంటలలోపు నేత్రదా నం చేయడానికి సంసిద్ధతను ఫోన ద్వారా తెలియ జేసినట్లయితే దగ్గరగా ఉన్న కంటి సేకరణ కేంద్రం వారు వచ్చి వారి నేత్రాలను సేకరించి అంధ త్వం గల వారికి ఉచితంగా అమర్చుతారన్నారు. ఆప్తమాలజిస్టు టెక్నీషి యన్స పరమేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 350 మంది విద్యా ర్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్‌ నాగస్వామి నాయక్‌ తన నేత్రాలు దానం చేయడానికి అంగీకార పత్రాన్ని డాక్టర్‌ సంధ్యారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు విజయ శేఖర్‌, సోమేష్‌, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:24 AM