డెంగీ నివారణపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:18 AM
ప్రజలకు డెండీ, మలేరియా నివారణపై అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి నూకరాజు సూచించారు.
జిల్లా మలేరియా అధికారి నూకరాజు
ఆలూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు డెండీ, మలేరియా నివారణపై అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి నూకరాజు సూచించారు. సోమ వారం ఆలూరు మండలం మొలగవెల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ, జ్వరాలు అధికమవుతున్నా యని, రోగులను పరీక్షింంచాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా కేంద్రానికి రిపోర్టు ఇవ్వాలన్నారు. ప్రజలు కాచి వడబోసిన నీటిని తాగాలని, దోమలు వ్యాప్తి చెందకుండా దోమ తెరలను వాడాలన్నారు. వైద్యులు మల్లేశ్వరి, ల్యాబ్ టెక్నీషియన్ పురుషోత్తం, హెడ్ నర్స్ రాధ, స్టాఫ్ నర్స్ రమాదేవి, ఏఎన్‌ఎంలు నాగవేణి, చంద్రకళ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.