క్యాన్సర్ పై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:22 AM
మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె. చిట్టినరసమ్మ సూచించారు.
కెఎంసీ ప్రిన్సిపాల్ కె.చిట్టినరసమ్మ
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె. చిట్టినరసమ్మ సూచించారు. శనివారం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’లో భాగంగా మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజల జీవనశైలి మారిందని, తీసుకునే ఆహారంలో హానికర కారకాలు ఉండటంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఆరోగ్యం విషయంలో చిన్న తేడా కనిపించినా వైద్యుడని సంప్రదించా లని కోరారు. అనంతరం వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.కృష్ణ ప్రకాష్, కెఎంసీ నోడల్ ఆఫీసర్ డా.మాధవీ శ్యామల, క్యాన్సర్ హాస్పిటల్ సీఎ్‌సఆర్‌ఎంవో డా.బి.హేమనళిని పాల్గొన్నారు.