హక్కులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:29 AM
వినియోగదారులకు తమ హక్కులు, బాద్యతలపై అవగాహన ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు తమ హక్కులు, బాద్యతలపై అవగాహన ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాయత్రి జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలని జేసీ జెండా ప్రారంభించారు. ఈ నెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను చైతన్యపరిచేందుకు అవాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వారం పాటు కళాశాలలు, పాఠశాలలు, కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు తప్పక బిల్లు తీసుకోవాలన్నారు. మోసపూరిత ప్రకటనలు, నాణ్యత లేని వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని, సమస్య వస్తే వినియో గదారుల కమిషన్‌ను ఆశ్రయించాలన్నారు. శివకిషోర్ కుమార్, నారాయణరెడ్డి, డీఎస్‌వో రాజా రఘువీర్, పోరం సెక్రటరీ శివమోహన్ రెడ్డి పాల్గొన్నారు.