అవయదానంపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:23 AM
రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవయవదానం, రక్తదానం పట్ల అవగాహన కల్పించాలని చైర్మన్ డా.కేజీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా నూతన చైర్మన్ డా.కేజీ గోవిందరెడ్డి
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవయవదానం, రక్తదానం పట్ల అవగాహన కల్పించాలని చైర్మన్ డా.కేజీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటి సమావేశం బ్లడ్ బ్యాంకులో నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలను అనుసంధానించుకుని ముందుకెళ్తామని తెలిపారు. యువతపై మాదక ద్రవ్యాలను వినియోగించకుంటే విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా వైస్ చైర్‌పర్సన్ అరుణ మాట్లా భక్తులకు గత 28 సంవత్సరాలుగా రెడ్‌క్రాస్ తరుపున వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. కోశాధికారి నరసింహ, కమిటి సభ్యులుగా జి.శ్రీనివాస్ యాదవ్, డా.కేవీ సుబ్బారెడ్డి, బి.ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, భీమశంకర్ రెడ్డి, వెంకట కృష్ణుడు పాల్గొన్నారు.