మిశ్రమ పంటలపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:42 PM
మిశ్రమ పంటల సాగు, ఎరువుల సమర్ధ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ‘భూమాత రక్షణ’కు సంబంధించిన జిల్లా స్థా యి సమావేశాన్ని నిర్వహించారు.
కలెక్టర్ డా.సిరి ఫ వివిధ శాఖల అధికారులతో విడివిడిగా సమావేశం, టెలీ కాన్ఫరెన్స్
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మిశ్రమ పంటల సాగు, ఎరువుల సమర్ధ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ‘భూమాత రక్షణ’కు సంబంధించిన జిల్లా స్థా యి సమావేశాన్ని నిర్వహించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, భూసార పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ‘భూమాత రక్షణ’ను అమలు చేస్తోందన్నారు. జేడీఏ వరలక్ష్మి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పాల్గొన్నారు.
అన్న క్యాంటీన్లపై గురువారం మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టిఫిన్, బోజన నిర్వహణ గురించి ఐవీఆర్‌ఎస్ పీడ్‌బ్యాక్ ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోందని, లోపాలు లేకుండా చూడాలన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ సిరి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. రహదారుల అభివృద్ది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, నీటి సరఫరా వ్యవస్థ, పార్కుల అభివృద్ది తదితర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
జిల్లాలో ఆరోగ్యం, విద్య, వసతి నిలయాలు, మహిళా సంక్షేమం, పారిశుధ్య నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఈవో సెట్కూరు డా.కే.వేణుగోపాల్‌ను నోడల్ అధికారిగా నియమించామని, కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్.1800 425 4299 ద్వారా సంప్రదించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని పురోగతి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. హెచ్చరించారు. ఉదయం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌కు సంబంధించి లబ్దిదారులు ఇచ్చిన ఐవీఆర్‌ఎస్ సమాధానాలు సంతృప్తికరంగా లేవన్నారు. నవంబరు 5వ తేదీలోపు సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
నాణ్యమైన వైద్యసేవలు అందించండి
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు మంచి వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డా.సిరి డీఎంహెచ్‌వోను ఆదేశించారు. రెండోసారి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన డా.ఎల్.భాస్కర్ గురువారం రాత్రి కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డా.ఎల్.భాస్కర్ సొంత ఊరు కడప జిల్లా, రాజంపేట. వెంకటరామరాజు, బుజ్జమ్మ తల్లిదండ్రులు. 2004లో తిరుపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2007లో కడప జిల్లా వనిపెంట పీహెచ్‌సీలో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 2007లో మహబూబ్‌నగర్‌లో ఫల్మనాలజీలో ఎండీ పూర్తి చేశారు. 2018 నుంచి 2022 వరకు కడపలో జిల్లా టీబీ ఆఫీసర్‌గా పనిచేసి, సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది కర్నూలు జిల్లా టీబీ ఆఫీసర్‌గా 2022 నుంచి పని చేస్తున్నారు.