జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:38 AM
జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల కలిగే లబ్ధి గురించి ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల కుటుంబానికి నెలకు దాదాపు రూ.1000 వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు. డీఆర్‌డీఏ, మెస్మా, వ్యవసాయ, విద్య తదితర శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ర్యాలీలు, ప్రదర్శనలు, వ్యాసరచనలు, వకృత్వపు పోటీలు నిర్వహించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిం చాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్
అన్న క్యాంటీన్, పారిశుధ్య నిర్వహణ అంశా లపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి సమా చారం తీసుకుంటున్న ఫీడ్ బ్యాక్‌లో సానుకూల స్పందన వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్, డీపీవోలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి పీజీఆర్‌ఎస్, ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్, జీఎస్టీ పన్నుల తగ్గింపుపై విస్తృత అవగాహన కల్పించే అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్‌కు సంబంధించి కొన్ని అన్న క్యాంటీన్‌లలో శానిటేషన్ పనులు సరిగ్గా జరగడం లేదని, భోజనం నాణ్యతగా లేదని, సమయానికి అన్న క్యాంటీన్లు తెరవడం లేదనే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి ఎట్‌టూ వ్యూలో ఒక అర్జీ కూడా ఉండకూడదని, వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని అధికారులను ఆదేశించారు.