Share News

సైబర్‌ నేరాల నివారణపై అవగాహన పెంచాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:47 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాల నివారణపై విసృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అధికారులను సూచించారు

సైబర్‌ నేరాల నివారణపై అవగాహన పెంచాలి
పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్పీ

నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల టౌన్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాల నివారణపై విసృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అధికారులను సూచించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా ప్రాపర్టీ కేసుల్లో రీకవరీ శాతం పెంచాలన్నారు. జిల్లాలో నేర నియంత్రణకు తీసుకోవాల్సిన శాంతి భద్రతల పట్ల ప్రాధాన్యత క్రమంలో వివరించారు. ప్రస్తుతం కేసుల్లో నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు విషయాలు వాటి పురోగతిపై ఆరా తీశారు. ఆధునిక పద్ధతులను ఉపయోగించి నేరగాళ్లను ఎలా పట్టుకోవాలో సూచనలు ఇచ్చారు. మర్డర్‌, సైబర్‌, మిస్సింగ్‌, ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నేర చరిత్ర, రౌడీ షీటర్లు, అనుమాతులను ఎప్పటికప్పుడు వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే కేసుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు, డీఎస్పీలు ప్రమోద్‌కుమార్‌, రామాంజినాయక్‌, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Nov 27 , 2025 | 12:48 AM