చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:41 PM
ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు. శనివారం ముజఫర్‌నగర్‌లో నల్సా పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
కర్నూలు లీగల్, అక్టోబరు 4 (ఆంధ్ర జ్యోతి): ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కోరారు. శనివారం ముజఫర్‌నగర్‌లో నల్సా పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో నిత్యం జరుగుతున్న ఆకృత్యాలు, జర్నలిస్టులపై దాడులు, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రజలు కృషి చేయాలన్నారు. బుడగ జంగాలు తమ పిల్లలకు బాల్య వివా హాలు చేయకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రుల తో పాటు ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తారని హెచ్చరిం చారు. శిక్షణలో ఉన్న న్యాయవాధికారులు కే.హేమ, ఎస్.లక్ష్మి, జి.అపర్ణ, పి.హేమ, కర్నూలు బ్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొండయ్య, డీసీపీవో శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్మన్ జుబేర్, లీగల్ సర్వీసెస్ మెంబర్ డా.రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.