Share News

జిల్లా కళాకారులకు కందుకూరి పురస్కారాలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:06 AM

రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా, తెలుగునాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి కందుకూరి పురస్కా రాలను జిల్లాకు చెందిన ఐదుగురికి ప్రదానం చేసింది.

జిల్లా కళాకారులకు కందుకూరి పురస్కారాలు
మంత్రి కందుల దుర్గేష్‌ నుంచి అవార్డులు అందుకుంటున్న కళాకారులు జీవీ శ్రీనివాస రెడ్డి,

కర్నూలు కల్చరల్‌ ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా, తెలుగునాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి కందుకూరి పురస్కా రాలను జిల్లాకు చెందిన ఐదుగురికి ప్రదానం చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వ హించిన కందుకూరి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ మాటల రచయిత బుర్ర సాయిమాధవ్‌, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారి నాయక్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రముఖ హార్మోనిస్టు ఎర్రమ పాండురంగయ్య, సీనియర్‌ రంగస్థల నటుడు జీవీ శ్రీనివాసరెడ్డి, గాండ్ల లక్ష్మన్న, రంగస్థల నటీమణులు ఎంఆర్‌ రాధిక, రామదుర్గం వనారస మంజుల పురస్కారాలు అందుకున్నారు. అవార్డులు అందుకున్న కళాకారులను టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మియా అభినందించారు.

నంద్యాల కల్చరల్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి కందుకూరి అవార్డును డాక్టర్‌ గుర్రాల రవికృష్ణ అందుకోగా, రంగస్ధల సంగీత దర్శకుడు పిఎస్‌ రత్నకుమార్‌, సీనియర్‌ రంగస్ధల నటుడు నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీబగుంట్లకు చెందిన మంఠం శంభుప్రసాద్‌, బండిఆత్మకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన రామసుబ్బయ్యలు జిల్లా స్థాయి అవార్డులను అందుకున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:06 AM