ప్రతిభను వెలికితీసేందుకే అవార్డులు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:00 AM
విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు అవార్డులు దోహదపడుతాయని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలి
రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
విద్యా రంగానికి పెద్దపీట : కలెక్టర్ రాజకుమారి
షైనింగ్ స్టార్స్-2025 అవార్డులు ప్రదానం
నంద్యాల రూరల్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు అవార్డులు దోహదపడుతాయని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల మండల పరిధిలోని ఏఎ్‌సఆర్ కల్యాణ మండపంలో పది, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. విద్యలో నాణ్యత, నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో 182మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20వేలు నగదు, ప్రశంసాపత్రం ఇవ్వడం గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మంచి ఫలితాలు సాధించిన అవార్డు గ్రహీతలను అభినందించారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రెడ్డి, ఆర్డీవో చల్లా విశ్వనాథ్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.