యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:58 PM
జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు.
వెల్దుర్తి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): యువతీ యువకులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎస్‌ఐ అశోక్ సూచించారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు. చిన్నవయసులో ప్రేమ జోలికి వెళ్లకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాల న్నా రు. డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా ఎన్‌డీపీఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తామని, 6 నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు. డ్రగ్స్ సమాచారాన్ని టోల్‌ఫ్రీ నెంబర్ 1972కు కాల్‌చేసి సమాచారం అందిం చాలన్నారు. ప్రిన్సిపాల్ నాగభూషణంరెడ్డి పాల్గొన్నారు.
బాలికలు ఉన్నతస్థాయికి చేరుకోవాలి
హాలహర్వి: బాలికలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎస్‌ఐ మారుతి సూచించారు. సోమవారం కస్తూర్బా పాఠశాలలో బాలికల కు అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందని, సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఎస్‌వో పద్మ పాల్గొన్నారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం..
ఆలూరు: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ మహబూబ్ బాషా సూచించారు. సోమవారం మోడల్ స్కూల్‌లో సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెల్‌కు వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయరాదన్నారు. బాఽఽధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని, బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.