Share News

ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్‌కు దూరం

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:32 AM

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకుంటే క్యాన్సనకు దూరం కావచ్చని బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ ఉమాదేవి అన్నారు.

ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్‌కు దూరం
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాదేవి

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాదేవి

బనగానపల్లె, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకుంటే క్యాన్సనకు దూరం కావచ్చని బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ ఉమాదేవి అన్నారు. శుక్రవారం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో క్యాన్సర్‌ నివా రణపై అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ మానవుని జీవనశైలిలో మార్పుతో బీపీ, షుగర్‌తో పాటు క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. నోటి, గర్భాశయ క్యాన్సర్‌లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు శైలజ, నాగప్రసాద్‌, రాజేశ, రాధారాణి, స్రవంతి, ఆశావర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 12:32 AM