ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:53 AM
స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాక్రిష్ణ డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవా రం ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన, సీఐటీయూ అధ్వ ర్యంలో స్థానిక అంబేడ్కర్ భవన నుంచి కలెక్టరేట్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. రాధాక్రిష్ణ మాట్లాడుతూ ఉచిత బస్సులతో ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందన్నారు. జీవో నెంబరు 21ని రద్దు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 18న జరి గే చలో విజయవాడను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్, సహాయ కార్యదర్శి మహమూద్, నగేష్, నరసింహులు, హుస్సేన వలి, డి.కుమార్ పాల్గొన్నారు.