Share News

ఆటో డ్రైవర్‌ నిజాయితీ.. ఐఫోన్‌ అప్పగింత

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:44 PM

నగరానికి చెందిన ఆటోడ్రైవర్‌ రవికుమార్‌ నిజాయతీ చాటుకుని ప్రయాణికుడు మరచిపోయిన ఐఫోన్‌ను తిరిగి అప్పజెప్పాడు.

ఆటో డ్రైవర్‌ నిజాయితీ.. ఐఫోన్‌ అప్పగింత
ఆటో డ్రైవర్‌ను అభినందిస్తున్న సీఐ, ప్రయాణికుడు

కర్నూలు క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన ఆటోడ్రైవర్‌ రవికుమార్‌ నిజాయతీ చాటుకుని ప్రయాణికుడు మరచిపోయిన ఐఫోన్‌ను తిరిగి అప్పజెప్పాడు. వివరాల మేరకు.. అభిరాం అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మౌర్యఇన్‌ జంక్షన్‌లో ఆటో ఎక్కి బాబా బృందావన్‌ నగర్‌లో దిగాడు. ఆటోలో తన ఐ ఫోన్‌ను మరిచిపోయాడు. అనంతరం ఆటో డ్రైవర్‌ వెంకటరమణ కాలనీకి వెళ్లి పెట్రోల్‌ పోయించే సమయంలో సీటుపై ఉన్న ఐపోన్‌ను గమనించి, తాను దింపిన ప్రయాణొకుడి ఇంటికి వెల్లి పోన్‌ను అప్పగించాడు. ప్రయాణికుడు అభిరాం విషయాన్ని పోలీసులకు తెలపడంతో నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ ఆటో డ్రైవర్‌ను అభినందించాడు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో జరిమానా

తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11 మందికి కోర్టు జరిమాన విధించింది. వివరాల మేరకు.. వారం రోజులుగా ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌ ఆధ్వర్యంలో డ్రంకెన్‌ డ్రైవ్‌తనిఖీలు చేశారు. 11 మంది మద్యం తాగి పట్టుబడటంతో గురువారం నిందితు లను కోర్టులో హాజరు పరిచారు. న్యాయా ధికారి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విదించినట్లు ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌ తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 11:44 PM