Share News

సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:52 AM

ప్రజల సమస్యల పరి ష్కారంపై అఽధికారులు దృష్టి సారించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరి ష్కారంపై అఽధికారులు దృష్టి సారించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వాటిని అప్పటికప్పుడే సంబంఽధిత అఽధికారు లతో మాట్లాడి పరిష్కరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమ స్యలను కార్యాలయాలకు వస్తే అధికారులు సమస్యలు పరిష్కరించాల న్నారు. ప్రజలను ఇబ్బందులుపెట్టే అఽధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్య లో ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికితీసుకు వచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల మెట్ట వద్దజరిగిన రోడ్డు ప్రమాంలో ఇరువురు మృతి చెందడంపట్ల మంత్రి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Dec 13 , 2025 | 12:52 AM