అలరించిన అవధానం
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:49 PM
కర్నూలు నగర శివారులోని మిలటరీ కాలనీలో ఉన్న జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిన అష్టావ ధానం ఆద్యంతం ఆకట్టుకుంది.

కర్నూలు రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర శివారులోని మిలటరీ కాలనీలో ఉన్న జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిన అష్టావ ధానం ఆద్యంతం ఆకట్టుకుంది. వర్థమాన అవధాని, దంత వైద్యుడు డాక్టర్ బోరెల్లి హర్ష నిర్వహించిన ఈ అవధాన కార్యక్రమంలో పండితులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఉప విద్యాశాఖ అధికారి ఎన్.హనుమతరావు హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సి. రాజేశ్వ రమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ హనుమంతరావు మాట్లాడుతూ అవధాన ప్రక్రియ తెలుగు భాషలో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. కాగా ఈ అష్టావధాన కార్య క్రమంలో సుధాకర శర్మ (నిషిద్ధాక్షరి), ప్రముఖ కవి తొగట సురేష్‌బాబు (సమస్య), నంది నాటక న్యాయ నిర్ణేత, రిటైర్డ్ హెచ్‌ఎం యర్రమ పాండురంగయ్య (పురాణ పఠనం), కవయిత్రి డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని (వర్ణన), శతకకర్త వరలక్ష్మి (న్యస్తాక్షరి), తెలుగు పండితుడు దేవవరం (ఆశువు), తెలుగు పండితుడు పి.రాఘవయ్య (యాం త్రిక గణనం), పాఠశాల ఉపాధ్యా యుడు శ్రీనివాసులు (అప్రస్తుత ప్రసంగం)లతో ఈ అష్టావధానం కొనసాగింది. అనంతరం అవధాని బోరెల్లి హర్షతో పాటు కవులు, తెలుగు పండితులను ఘనంగా సత్కరించారు.