Share News

వ్యక్తిగతంగా హాజరు కండి

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:56 PM

: నగరపాలక సంస్థ జీఎస్టీ విషయంలో పలుమార్లు నోటీసులు పంపినా స్పందించలేదని, ఈ నెల 23న వ్యక్తిగతంగా హాజరై లిఖిత పూర్వకంగా సమాదానం ఇచ్చి, రికార్డులతో హాజరు కావాలని వాణిజ్య పన్నుల శాఖ జేసీ బుధవారం ఫైనల్‌ నోటీసు జారీ చేశారు.

వ్యక్తిగతంగా హాజరు కండి

కార్పొరేషన్‌ కమిషనర్‌కు వాణిజ్య పన్నుల శాఖ నోటీసు

కర్నూలు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ జీఎస్టీ విషయంలో పలుమార్లు నోటీసులు పంపినా స్పందించలేదని, ఈ నెల 23న వ్యక్తిగతంగా హాజరై లిఖిత పూర్వకంగా సమాదానం ఇచ్చి, రికార్డులతో హాజరు కావాలని వాణిజ్య పన్నుల శాఖ జేసీ బుధవారం ఫైనల్‌ నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్‌ వ్యాపార ప్రాంగణాన్ని తనిఖీచేసిన సమయంలో ధ్రువీకరిం చబడిన రికార్డులను పరిశీలిస్తే పలు అవకతవకలు గుర్తించబడ్డాయని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2021-22, 2022-23, 2023-24కు పన్నులకు సంబంధించి ఫారం జీఎస్టీ-డీఆర్‌సీ-01లో షోకాజ్‌ నోటీసు జారీ చేయబడిందని తెలిపారు. దీనికి సరైన సమాధానం ఇవ్వలేదని అందులో వివరించారు. దీనిపై అభ్యంతరాలు సమర్పించడానికి, సరైన వాదనలు వినిపించడానికి నవంబరు 24న స్వయంగా, అధీకృత ప్రతినిధి ద్వారా వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించామన్నారు. మూడేళ్ల పన్నుకు సంబంధించి వివరణాత్మక సమాధానం దాఖలు చేయడానికి సమయాన్ని కోరారన్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత పూర్తి సమాధానం సమర్పించడానికి మంజూరు చేసిన సమయం కూడా ఇచ్చామన్నారు. సమాధానం ఇవ్వడానికి మరో 20 రోజుల సమయం కోరుతూ మరో అభ్యర్థన చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. మీ అభ్యర్థనను పరిశీలించిన తర్వాత ఈ నెల 23న వ్యక్తిగతంగా హాజరై అవసరమైన డాక్యుమెంట్లతో హాజరు కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:56 PM