బనకచర్ల సాక్షిగా నీటి వాటాలపై దాడి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:51 PM
బనకచర్ల సాక్షిగా రాయలసీమలోని ప్రాజెక్టుల నీటి వాటాలపై దాడి జరుగుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడి బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి
పాములపాడు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల సాక్షిగా రాయలసీమలోని ప్రాజెక్టుల నీటి వాటాలపై దాడి జరుగుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడి బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని 30 రోజుల్లో తరలించేందుకు సాగునీటి వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను తొలగించాల్సిన పాలకులు, ఆ పనులు చేయడం లేదన్నారు. సీమకు చేరాల్చిన రెగ్యులేటర్ల నీటి ప్రవాహాన్ని మార్చి నెల్లూరు వైపు తరలించే కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ విధంగా కృష్ణాజలాలను తరలించే తరుణంలో రాయలసీమలో మరింత బలవంతపు భూసేకరణ చేస్తున్నారన్నారు. సీపీఐరాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయలు మాట్లాడుతూ రాయలసీమ రైతుల కోసం ప్రాజెక్టులు సాధించేందుకు సీపీఐ మొదటి నుంచి ముందుండి పోరాటాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు రఘురాంమూర్తి, రమేష్, సాగునీటి సాధన కమిటీ సభ్యులు గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.