బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడి
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:41 AM
అద్దె బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేయడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న ప్రైవేటు బస్సుల డ్రైవర్లు బుధవారం విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు.
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
డిపో వద్ద డ్రైవర్ల నిరసన
ఆళ్లగడ్డ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): అద్దె బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేయడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న ప్రైవేటు బస్సుల డ్రైవర్లు బుధవారం విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి... ఆళ్లగడ్డ డిపో పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ హయ్యర్ బస్సును దువ్వూరు వద్ద ఆపలేదని ఓ ప్రయాణికుడు డ్రైవర్ మహుమ్మద్‌పై దాడి చేశాడు. డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో ప్రైవేటు బస్సుల డ్రైవర్లు బస్సులను డిపో ఆవరణంలో ఉంచి సీఐటీయూ కార్యద ర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆళ్లగడ్డ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ మహుమ్మద్‌పై దాడి చేసిన వ్యక్తిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా నంద్యాల, కోవెలకుంట్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు డిపోలలోని ప్రైవేటు బస్సుల డ్రైవర్లు పాల్గొన్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఒక్కసారిగా ప్రైవేటు బస్సులు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డ్రైవర్‌పై దాడిని ఖండిచిన ఆర్‌ఎం
ఆళ్లగడ్డ- మైదుకూరు హయ్యర్ బస్సు డ్రైవర్ మహుమ్మద్ పై జరిగిన దాడిని నంద్యాల రీజనల్ మేనేసర్ రజియా సుల్తానా తీవ్రంగా ఖండించారు. విషయం తెలిసిన వెంటనే బుధవారం ఆమె ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోకు తరలి వచ్చారు. దాడి ఘటనపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సంఘటనతో జిల్లా వ్యాప్తంగా హయ్యర్ బస్సుల డ్రైవర్లు ఽధర్నాలో పాల్లొన్నారన్నారు. దాడి విషయాన్ని ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ దృష్టికి తీసుకెళ్లామని బాధిత డ్రైవర్‌కు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.