ముగిసిన అటల్ స్టింకరింగ్ వర్క్‌షాప్
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:54 PM
కర్నూలు నగరంలోని కింగ్ మార్కెట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూడు రోజుల క్రితం ఆరంభమైన అటల్ స్టింకరింగ్ వర్క్‌షాప్ కార్యక్రమం బుధవారం ముగిసింది
కర్నూలు ఎడ్యుకేషన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని కింగ్ మార్కెట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూడు రోజుల క్రితం ఆరంభమైన అటల్ స్టింకరింగ్ వర్క్‌షాప్ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి డీఈవో శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అటల్ స్టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ, విద్యార్థుల ప్రాజెక్టు రూపకల్పన, సేఫ్టీ ప్రమాణాలు, ఎలక్ర్టానిక్ కిట్ల వినియోగం, డాక్యుమెంటేషన్ ప్రాజెక్టు అథారిత నేర్పు వంటి అంశాలపై లోతైన శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు టెక్నాలజీ అథారిత భవిష్యత్తు దిశగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో శ్రీధర్‌బాబు, ఎంఈవోలు ఈశ్వరమ్మ బాయి, అబ్దుల్ రెహిమాన్, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ, అటల్ అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.