సిద్ధిదాయినీగా భ్రమరాంబికాదేవి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:48 PM
శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా ఉత్సవాల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైలం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా ఉత్సవాల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతఃకాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుదాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్రపారాయణాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించారు. వాహనసేవలో భాగంగా స్వామి, అమ్మవారు కైలాస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య కళారాధన వేదిక వద్ద మార్కాపురానికి చెందిన శ్వేత నాట్య అకాడమీ కళాకారులు భక్తిరంజని, వనపర్తికి చెందిన సత్యం బృందం ఆలపించిన శైవగీతాలు ఆకట్టుకున్నాయి.
నేడు అశ్వవాహన సేవ: ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా సాయంత్రం ఉత్సవమూర్తులకు అశ్వవాహన సేవ ఉంటుంది.