Share News

శ్రీశైలంలో ఆరుద్ర పూజలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:15 PM

శ్రీశైల మహా క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర పూజలు, స్వర్ణ రథోత్సవం, పల్లకీ సేవను ఆదివారం వైభవంగా నిర్వహించారు.

శ్రీశైలంలో ఆరుద్ర పూజలు
స్వర్ణ రథోత్సవాన్ని ప్రారంభిస్తున్న ఈవో, చైర్మన్‌

వైభవంగా స్వర్ణ రథోత్సవం, పల్లకీ సేవ

స్వామి, అమ్మవార్లను అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

శ్రీశైలం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర పూజలు, స్వర్ణ రథోత్సవం, పల్లకీ సేవను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామికి మహన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చనలు చేసిన తరువాత భక్తులకు దర్శనాలు తీర్థప్రసాదాలు కల్పించారు. అనంతరం గంగాధర మండపం రథశాల వద్ద స్వర్ణరథంపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు, శ్రీనివాసరావు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన వీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ రద్దీ ఎక్కువగా ఉండడంతో గ్రామోత్సవం నిర్వహించలేదని అధికారులు తెలిపారు. కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ స్వామి, అమ్మవార్లకు నృత్య నివేదన చేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పాలంకరణ చేసిన పల్లకిపై ఆదిదంపతులను ఆశీనులచేసి వార పూజల చేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.

శివ నామస్మరణతో మార్మోగిన శ్రీగిరి క్షేత్రం

పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర పర్వదినం సందర్భంగా ఆదివారం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్ల ద్వారా ఉభయ దేవాలయాల్లో అలంకార దర్శనం ల్పించారు. ఉచిత దర్శనానికి కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉండే భక్తులకు 5 నుంచి 6గంటల సమయం పట్టగా, శ్రీఘ్ర, అతిశీఘ్ర టిక్కెట్‌ దర్శనాలకు రెండు గంటలు, వీఐపీ బ్రేక్‌ టికెట్లు పొందినవారికి గంట సమయం పట్టిందని ఆలయాధికారులు చెప్పారు. 50వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసాం తం చేసే పూజల్లో భాగంగా సాయత్రం ఆలయ ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. మాడవీధిలో ఏర్పాటైన కళారాధన వేదికపై కళాకారులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Updated Date - Nov 09 , 2025 | 11:15 PM