Share News

కారు దొంగల అరెస్టు

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:32 AM

ఎమ్మిగనూరులో జనవరిలో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఇన్నోవా క్రిష్టా కారు ఎత్తుకెళ్ళిన దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు గురవారం ఆరెస్టు చేశారు

 కారు దొంగల అరెస్టు
ఇన్నోవా కారుతో పోలీసులు

పది నెలల తరువాత ఛేదించిన పోలీసులు

ఎమ్మిగనూరు టౌన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరులో జనవరిలో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఇన్నోవా క్రిష్టా కారు ఎత్తుకెళ్ళిన దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు గురవారం ఆరెస్టు చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు... జనవరి 15వ తేది నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా గోనెగండ్ల మండలం, హెచ్‌ కైరవాడి గ్రామానికి చెందిన అంజనేయులు (44) ఇన్నోవా క్రిష్టా కారును పార్కింగ్‌చేసి స్వామి దర్శన నిమిత్తం వెళ్లారు. ఇదే అదనుగా మహారాష్ట్ర దొంగల ముఠా కారును దొంగిలించారు. అంజనేయులు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు పది నెలల తరువాత రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో ఉన్న దొంగల ముఠాను ఆరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరచగా నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. దొంగల ముఠాను ఆరెస్ట్‌ చేయడానికి సీసీటీవీలు, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో మహారాష్ట్ర బీడ్‌ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారు ఎ1 విఠల్‌ సాకారం లష్కరే, ఎ2 పరశురాం మోహన్‌ గైక్వాడ్‌, ఎ3-భీమ్‌ రావు సహదేవ్‌, ఎ4 రాజు గైక్వాడ్‌, ఎ5-ఆనిల్‌ జాదవ్‌, ఎ6- జ్ఞానేశ్వర్‌ జాదవ్‌ అని తెలిపారు. దొంగల ముఠా అక్కడ స్థానికులతో పోలీసులపై ప్రతి దాడులకు దిగగా, చాకచక్యంగా వ్యవహరించి ఆరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈ కేసు విషయంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీ భార్గవి మహారాష్ట్ర పోలీసులను సమన్వయ పరుస్తూ తమకు సహకరించార న్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:32 AM