ప్రధాని పర్యటన ఏర్పాట్లు వేగవంతం
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:46 PM
ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లన్న దర్శనార్థం రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేశారు.
శ్రీశైలం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లన్న దర్శనార్థం రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేశారు. సుండిపెంట కాలనీ నుంచి శ్రీశైలం వరకు పారిశుధ్య పనులు, రోడ్లకు ఇరువైపుల మట్టి చదును పనులు, హెలిప్యాడ్ వద్ద బారికేడ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే ముఖద్వారం నుంచి ఆర్చీలకు రంగులు, క్షేత్రంలో బారికేడ్ల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపుల కాంక్రీట్ పనులు, మాడవీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయ గంగాధర మండపం వద్ద తారు రోడ్డు పనులు, బందోబస్తుకు పందిళ్లు, ఆలయం ప్రధాన ద్వారం నుంచి రాజగోపురం వరకు అందమైన పూల మొక్కలు, ఆలయ లోపల క్యూలైన్లకు రంగులు, స్వామివారి ఆలయ నుంచి అమ్మవారి అలయం వరకు టెన్‌జైల్డ్ ఫ్యాబ్రికేషన్ పందిళ్లు, గోడలకు చిత్రాలు, క్షేత్రంలో పచ్చదనంతో సుందరీకరణ మొక్కలు, అతిఽథిగృహం వద్ద కార్పెంటర్ వర్క్స్ తదితర పనులు వేగంగా జరుగు తున్నాయి. ఆయా శాఖల అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.