ఆర్‌యూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:48 PM
రాయలసీమ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతు న్నాయని ఉపకులపతి వి. వెంకట బసవరావు తెలిపారు.
18,396 మంది దరఖాస్తులు
75 గోల్డు మెడల్ పీహెచ్ డీల ప్రదానం
ఉప కులపతి వి. వెంకట బసవరావు
కర్నూలు అర్బన్ , నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాయలసీమ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతు న్నాయని ఉపకులపతి వి. వెంకట బసవరావు తెలిపారు. శుక్రవారం వర్సిటీలోని కాన్ఫరెన్సు హాలులో రెక్టార్ ఎన్ టీకే నాయక్, రిజిస్ట్రార్ బోయ విజయకుమార్ నాయుడు, పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ వి. వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్నాతకోత్స వానికి 18,396 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 75 మందికి గోల్ట్ మెడల్ పీహెచ్ డీలు ప్రదానం చేయబోతున్నామని తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి జస్టిస్ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని తెలిపారు. ఏమ్ గ్రీన్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్‌ఎస్ వి. రామకుమర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయబోతున్నామని తెలిపారు. స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న బంగారు పతక విజేతలు, పరిశోధక విద్యార్థులు స్నాతకోత్సవానికి ముందు కంట్రోలర్ ఆఫ్ పరీక్షల విభాగంలో ఎంట్రీ పాసులు పొందాలని సూచించారు. విద్యార్ధితో పాటు మరొకరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఉదయం 8 గంటలోపు రిజిస్ర్టేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని, 10 గంటల కంతా స్నాతకోత్సవ హాలులో సిద్ధంగా ఉండాలని సూచించారు. డీన్లు సుందరానందపుచ్చా, భరత్ కుమార్, సి. విశ్వనాథఽరెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.
12న గవర్నర్ రాక
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 12వ తేదీన గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్ కర్నూలుకు రానున్నారు. రాయలసీమ యూనివర్సిటీ 4వ కాన్వికేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం నగరంలోని మాంటిస్సోరి స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.