Share News

వైసీపీ అక్రమాలపై చర్చకు సిద్ధమా? : సోమిశెట్టి

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:42 PM

నగరంలో వైసీపీ చేసిన అక్రమాలు, భూ కబ్జాలకు సిద్ధమా? అని కుడా చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

వైసీపీ అక్రమాలపై చర్చకు సిద్ధమా? : సోమిశెట్టి
మాట్లాడుతున్న కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): నగరంలో వైసీపీ చేసిన అక్రమాలు, భూ కబ్జాలకు సిద్ధమా? అని కుడా చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఫైనాన్‌ ్స కార్పొరేషన్‌ చైర్మన్‌ అకెపోగు ప్రభాకర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి టీజీ భరత్‌ నగరంలోని ఏ,బీ,సీ క్యాంపుల్లో ఉన్న స్థలాలను కబ్జా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు, వైసీపీ అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీజీ కుటుంబానికి అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడిన అవసరమే లేదన్నారు. కబ్జాకోరల్లో ఉన్న ఏ,బీ,సీ క్యాంపుల్లోని క్వార్టర్లకు సంబంధించి గతంలో జగన్‌ అనే వ్యక్తి లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించాడన్నారు. లోక్‌ అదాలతో తీసుకున్న నిర్ణయంతోనే జిల్లా యంత్రాంగం క్వార్టర్లను ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. గత వైసీపీ పాలనలో జిల్లాలో దోచుకున్న అక్రమాస్తులు, దోపిడిని కక్కిస్తామని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఇక మేయర్‌ బీవై రామయ్య అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ జకియా అన్సారీ, టీడీపీ నాయకులు సోమిశెట్టి నవీన్‌ , వి.హనుమంతరావు చౌదరి, నాగరాజు, అబ్బాస్‌, పోతురాజు, రవికుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:42 PM