170.14 ఎకరాలకు ఆమోదం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:51 PM
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన 31వ రాష్ట్ర కేబినెట్ సమా వేశంలో పలు కీలక ఆంశాలకు ఆమోదం పడింది.
ఒక్కొక్క ఎకరాకు రూ. 6.25 లక్షలు ఖరారు
డ్రైవర్లకు అండగా ‘ఆటో డ్రైవర్ల సేవ’
జిల్లాలో 10,006 మందికి లబ్ధి
నంద్యాల, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన 31వ రాష్ట్ర కేబినెట్ సమా వేశంలో పలు కీలక ఆంశాలకు ఆమోదం పడింది. జిల్లాలోని పిన్నాపురం ప్రాజెక్టుతో పాటు ‘ఆటో డ్రైవర్ల సేవ’ పథకం అమలుకు సంబంధించి ఆమో దం తెలిపి నిధులు కేటాయించారు. సోలార్ ప్రాజెక్టుతో పాటు డ్రైవర్లకు ఎంతో ప్రయోజన కరంగా మారినట్లైంది.
పిన్నాపురం ప్రాజెక్టు కింద..
పాణ్యం నియోజకవర్గంలోని పిన్నాపురంలో పిన్నాపురం ప్రా జెక్టు కింద సోలార్ కోసం సుమారు 6వేల ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విడతలవారీగా 90శాతం ఎకరాల భూమికి అప్పగించి సోలార్ వినియోగం తో విద్యుత్ ఉత్పత్తి, జల, పవన విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే పిన్నా పురంలో మెస్సర్స్ గ్రీన్‌కో ఏపీ01 ఐఆర్‌ఈపీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 174.10 ఎకరాలకు ఒక్కొక్క ఎకరాకు.. రూ. 6.25లక్షలు చొప్పున అప్పగించింది. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు స్థాపన కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. గతంలో 2020 జూన్13న ఎకరా రూ.5లక్షలు చొప్పున నిర్ణయించగా.. వివిధ కారణాలతో సదరు ఫైల్ ఆగిపోయింది. కూటమి రాకతో కలెక్టర్ రాజకుమారి మరోమారు సదరు ఫైల్‌ను పున:పరిశీలన చేసి ఎకరా.. రూ.6.25లక్షలు చొప్పున సదరు సంస్థ ప్రభుత్వానికి అందజేయాలని నివేదిక పం పారు. తాజాగా కేబినెట్‌లో పై విధంగా ఆమోదం తెలిపింది.
జిల్లా వ్యాప్తంగా 10,006 మందికి..
కూటమి ప్రభుత్వం శుక్రవారం అమలు చేయనున్న ‘ఆటో డ్రైవర్ల సేవ’ ఆయా వర్గాల డ్రైవర్లు అండగా ఉండే విధంగా కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. అధికార లెక్కల ప్రకారం సదరు పథకం కింద జిల్లావ్యాప్తంగా 10,006మందికి లబ్ధి చేకూ రనుంది. వారికి రూ.15.09 కోట్లు అందనున్నాయి. ఒక్కొక్కరికి రూ. 15వేలు చొప్పున నేడు ఆయా డ్రైవర్ల ఖాతాలో జమ చేయనుంది.