తైక్వాండో విజేతలకు టీజీ అభినందన
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:31 PM
ఇటీవల కర్నూలులో నిర్వహించిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల విజేతలను మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అభినందిం చారు.
కర్నూలు స్పోర్ట్స్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కర్నూలులో నిర్వహించిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల విజేతలను మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అభినందిం చారు. ఆదివారం స్వగృహంలో విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. టీజీవీ, టీజీబీ తైక్వాండో అకాడమీ కోచ్ వ్యవస్థాపకుడు టి.వెంకటేశ్వర్లును టీజీ అభినందించారు. క్రీడాకారులకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ, శరీర ధారుఢ్యం అలవరుతాయని టీజీ తెలిపారు. తైక్వాండో కోచ్‌లు బాక్సింగ్ కార్యదర్శి అజయ్, నందిని, అశ్విని, లలిత, టీ.తేజ పాల్గొన్నారు.