పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి : కలెక్టర్
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:36 AM
రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. శనివారం చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. శనివారం చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో అస్పష్టమైన సంబంధం లేని ఫోటోలు, అసంబద్దమైన నమోదులను తొలగించడంలో ఏజెంట్లు, బీఎల్‌వోలకు సహకరించాలని కోరారు. ఓటర్ల మ్యాపింగ్‌లో రాష్ట్రంలో జిల్లా 47.90 శాతంతో 14వ స్థానంలో ఉందని, జనవరి చివరి నాటికి గ్రామాల్లో 75 శాతం, పట్టణాల్లో 85 శాతం మ్యాపింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈసీ మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీచేసి, భద్రతా చర్యలను పరిశీలించారు. సమావేశంలో టీడీపీ గట్టు అన్వేష్, బీజేపీ పీటీ సాయిప్రదీప్, జనసేన తల్లా మంజునాథ్, బీఎస్‌పీ ఇన్‌చార్జి అరుణ్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.