Share News

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:57 PM

: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని టాప్‌-500 కంపెనీలలో యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించడానికి అవకాశం కల్పిస్తోంది. ఇందుఉ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది..

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి దరఖాస్తు చేసుకోండి

మార్చి 31 చివరి తేదీ

వెల్దుర్తి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని టాప్‌-500 కంపెనీలలో యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించడానికి అవకాశం కల్పిస్తోంది. ఇందుఉ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది..

అర్హులు..: భారతీయులై ఉండాలి. అప్లికేషన్‌ చేసే సమయానికి సర్టిఫికెట్‌ ప్రకారం వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఫుల్‌టైం ఉద్యోగిగా ఎక్కడ ఉండకూడదు. ఫుల్‌టైం ఎడ్యుకేషన్‌ ప్రస్తుతం చేస్తూ ఉండకూడదు. ఆన్‌లైన్‌ లేదా డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ చేస్తున్న వారు అర్హులు. ఎస్‌ఎస్‌సీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, బీఏ, బీఎస్‌సీ, బీఫార్మా, బీబీఏ వంటి ఏదైనా డిగ్రీ ఉండాలి.

దరఖాస్తు విధానం

1. రిజిస్ర్టేషన్‌ ఇన్‌ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ పోర్టల్‌ (పీఎం ఇంటర్న్‌షిప్‌.ఎంసీఏ.జీవోవీ.ఇన్‌)

2. ఇంటర్న్‌షిప్‌ అప్లికేషన్‌ ఇన్‌ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ పోర్టల్‌

3. యాక్సెప్ట్‌ ఫ్రమ్‌ కంపెనీస్‌

దరఖాస్తుకు అవసరమయే డాక్యుమెంట్లు..

1. పదవ తరగతి సర్టిఫికెట్‌ మరియు పైన తెలిపిన డిగ్రీ సర్టిఫికెట్లు

2. ఆధార్‌ కార్డు నెంబరు 3. ఆధార్‌కార్డు లింక్‌ అయిన మొబైల్‌ నెంబరు 4. ఈమెయిల్‌ ఐడీ వెరిఫికేషన్‌

నీలిమ..సహాయ కార్మిక అధికారి

సొంత రాష్ట్రంలో దగ్గర్లో ఉన్నటువంటి స్థానంలో కూడా దరఖాస్తు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు మాకు పంపాలి. సెలక్షన్‌ అయిన వారి ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. నేరుగా వారి లాగిన్‌ ఓపెన్‌ చేసి ఆన్‌లైన్‌లో సెలక్షన్‌ ఆర్డర్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రయోజనాలు..

1. అర్హత సాధించిన వారికి జాయినింగ్‌ ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.6 వేలు నేరుగా ఆధార్‌ కార్డు లింక్‌ అయిన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

2. ఇంటర్న్‌షిప్‌ ప్రారంభమైన తర్వాత ప్రతి నెలా ఏ కంపెనీలో జాయిన్‌ అవుతారో ఆ కంపెనీ ద్వారా రూ.500 నగదు ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వారి బ్యాంకు ఖాతాలో జమ అయిన తరువాత కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగిలిన రూ.4500 నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. మొత్తం ఒక నెలకు రూ.5 వేలు నగదు బ్యాంకు ఖాతాలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వారి ఖాతాలో జమ అవుతాయి.

3. జాయిన్‌ అయిన సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన

పథకాలు రెండు కూడా సెలక్ట్‌ అయిన వారి పేరుపై ప్రభుత్వం ఆటోమెటిగ్గా మొదలుపెడుతుంది. ఇది సంవత్సరకాలం ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వారిపై ఉంటుంది.

4. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత కంపెనీ వారిచ్చే సర్టిఫికెట్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుంది.

Updated Date - Mar 12 , 2025 | 11:57 PM