అర్జీలను నాణ్యంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:03 AM
అర్జీదారులను పదే పదే తిప్పించుకోవద్దని, గడువులోపు నాణ్యంగా అర్జీలను పరి ష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అర్జీదారులను పదే పదే తిప్పించుకోవద్దని, గడువులోపు నాణ్యంగా అర్జీలను పరి ష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్ డా.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ అర్జీకి సంబంధించి సరైన విధంగా అర్థమయ్యేలా పూర్తి వివరాలతో ఎండార్స్‌మెంటు తయారు చేసి అర్జీదారులకు వాట్సాప్‌లో పంపించి ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. రీ ఓపెన్, గడువు దాటిన తర్వాత పరిష్కారం ఉండకూదన్నారు. పరిష్కరించలేని సమస్యలైతే అర్జీదారునికి వివరించి చెప్పాలన్నారు. ఆడిట్ ప్రక్రియ వంద శాతం చేయాలని, సీఎంవో అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనూరాధ, కొండయ్య, అధికారులు పాల్గొన్నారు.