అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:38 AM
అర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారు లను ఆదేశించారు.
నగర పాలక కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): అర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారు లను ఆదేశించారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు సంతప్తి చెందేలా అర్జీల పరిష్కారం ఉండాలన్నారు. కార్యక్ర మంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, మేనేజర్ చిన్నరాముడు, ఇంచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి, టీపీఆర్‌ఓ శ్రీనివాసులు, ఆర్‌ఓ జునైద్ పాల్గొన్నారు.
ఇనచార్జి ఎస్‌ఈపై కమిషనర్ ఆగ్రహం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరుకాకుండ ఎలాంటి సమాచారం ఇవ్వకుండ వెళ్లిన ఇంచార్జి ఎస్‌ఈ శేషసాయిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కిందిస్థాయి అధికారులనైనా వేదిక కార్యక్రమా నికి పంపకుండ ఎలా ఉంటారని ఫోనలో అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి నగర పాలకలోని సెక్షన విభాగాల అధికారుల తోపాటు కిందిస్థాయి ఉద్యోగులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.