గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:51 AM
ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.
నగర పాలక కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను కమిషనర్ స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, మేనేజర్ చిన్నరా ముడు, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, ఆర్‌ఓ జునైద్, టీపీఆర్‌ఓ శ్రీనివాసులు, టిడ్కో అధికారి పెంచలయ్య పాల్గొన్నారు.