గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
ABN , Publish Date - May 14 , 2025 | 11:31 PM
మండలంలోని బలపనూరు పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు ప్రిన్సిపాల్ మేరీ సలోమి తెలిపారు.
పాణ్యం, మే 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బలపనూరు పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు ప్రిన్సిపాల్ మేరీ సలోమి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు పొందాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నా రు. మూడో తరగతి ప్రవేశానికి చెంచు బాలిక లకు 75 సీట్లు, ఎస్సీలకు 2 సీట్లు, ఓసీలకు 1, బీసీలకు1, ఇతరులకు 1 చొప్పున మొత్తం 80 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. కేవలం చెంచు బాలికలకు మాత్రమే నాలుగో తరగతికి 66 సీట్లు, 5వ తరగతికి 70 సీట్లు, 6వతరగతికి 65, 7వతరగతికి 59 సీట్లు, 8వతరగతికి 60 సీట్లు, 9వతరగతికి 49 సీట్లు ఖాళీగా ఉన్నాయ న్నారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన బాలికలు దరఖాస్తు చేసు కోవాలన్నారు. ఈనెల 25వ తేదీలోగా దరఖా స్తులను పాఠశాలకు అందజేయాలన్నారు. వివరాలకు 8106979149, 7013582204 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.