Share News

ఏపీఈపీ సెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:34 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ రంగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈపీసెట్‌ ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.

ఏపీఈపీ సెట్‌ ఫలితాలు విడుదల
రామ్‌చరణ్‌రెడ్డి

జిల్లాలో అర్హత సాధించిన 3,648 మంది విద్యార్థులు

నంద్యాల జిల్లా విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ రంగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈపీసెట్‌ ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 3075 మంది బాలురు ప్రవేశ పరీక్ష రాయగా 2117 మంది, 2130 మంది బాలికలు ప్రవేశ పరీక్ష రాయగా 1531 మంది అర్హత సాధించారు. మొత్తంగా 3648 మంది అర్హత సాధించారు.

నంద్యాల జిల్లా విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో నాల్గవ ర్యాంక్‌

నంద్యాల జిల్లా అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన రామ్‌చరణ్‌రెడ్డి ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్‌ సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, నంద్యాల 35వ వార్డు సచివాలయం ఉద్యోగి రాణిరుద్రమదేవి కుమారుడైన రామ్‌చరణ్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్‌ సాధించడం పట్ల పలువురు ప్రశంసించారు. రామ్‌చరణ్‌రెడ్డి 5వ తరగతి వరకు నంద్యాలలోని కేశవరెడ్డి స్కూల్‌లో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విజయవాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో చదివారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు రామ్‌చరణ్‌రెడ్డి ఇటీవల విడుదలైన తెలంగాణా టీపీఈపీసెట్‌లో కూడా రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించారని, అలాగే జేఈఈ మెయిన్స్‌లో 53వ ర్యాంక్‌, అడ్వాన్స్‌డ్‌లో 170వ ర్యాంక్‌ సాధించారని తెలిపారు. విద్యార్థి రామచరణ్‌రెడ్డి మాట్లాడు తూ తాను ఐఐటీలో సీఎస్‌ఈ చేయాలని ఉందని, జేఈఈలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా మద్రాస్‌లో కాని, కాన్పూర్‌లో కాని సీటు వస్తుందని, ఐఐటీ పూర్తిచేయడమే తన లక్ష్యమని అన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:34 AM