మరో రైతుబజార్
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:52 PM
నగరంలోని సి.క్యాంపు రైతు బజార్‌ను విస్తరిస్తామని ఇచ్చిన హమీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది మే నెలలో సీఎం కర్నూలులో పర్యటించిన విషయం విదితమే. సి.క్యాంపు రైతు బజారును చూసి ఒకప్పుడు తాను నాటిన విత్తనం (సీ.క్యాంప్ రైతుబజార్) ఈరోజు శాకోపశాఖలుగా అభివృద్ధి చెంది వందలాది మంది రైతులు, పొదుపు మహిళలకు ఉపాధి కల్పిస్తున్న విషయం స్వయంగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు
సి.క్యాంపులో నిర్మాణానికి రూ.6 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సి.క్యాంపు రైతు బజార్‌ను విస్తరిస్తామని ఇచ్చిన హమీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది మే నెలలో సీఎం కర్నూలులో పర్యటించిన విషయం విదితమే. సి.క్యాంపు రైతు బజారును చూసి ఒకప్పుడు తాను నాటిన విత్తనం (సీ.క్యాంప్ రైతుబజార్) ఈరోజు శాకోపశాఖలుగా అభివృద్ధి చెంది వందలాది మంది రైతులు, పొదుపు మహిళలకు ఉపాధి కల్పిస్తున్న విషయం స్వయంగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న ఈ రైతు బజారును విస్తరించాలన్న రైతులు, పొదుపులక్ష్మి గ్రూపుల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఆర్‌అండ్‌బీ క్వార్లర్లు కేటాయించిన స్థలంలో మరో రైతుబజారును నిర్మిస్తామన్నారు. అమరావతికి వెళ్లిన తక్షణమే నివేదిక తయారు చేయాలని మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడంతో డీఈఈ రఘునాథరెడ్డి, సిబ్బంది రూ.6.5 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి నివేధించారు. వారం క్రితం ఆ శాఖ కమిషనర్ విజయ సునీత నివేదికను ఆమోదించి, ఆర్థిక శాఖకు పంపగా ఆమోదం పొందినట్లు మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నారాయణమూర్తి తెలిపారు.
ఇదీ రైతు బజార్ స్వరూపం..
కొత్తగా నిర్మించబోయే రైతుబజార్‌లో 155 స్టాల్స్, 35 షాపులు, మరో రెండు టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. వారంలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని, టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం నగర జనాభా సుమారు 6లక్షలు. ఇక్కడ కూరగాయలు కొనేందుకు సమీప గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి కూడా వినియోగదారులు వస్తున్నారు. దీంతో రైతు బజారు స్థలం సరిపోవడం లేదు. కొత్త రైతు బజార్ నిర్మాణం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు తొలగుతాయి
సి.క్యాంపు రైతు బజార్‌లో రద్దీతో కూరగాయలు కొనేందుకు ఎక్కువ సమయం పడుతుంది.. నూతన రైతు బజార్ నిర్మాణంతో ఇబ్బం దులు తొలగుతాయి. సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. - సుభాషిణి, వినియోగదారురాలు, కర్నూలు.
త్వరలోనే టెండర్లు
నగరంలోని సి.క్యాంపు రైతుబ జార్ పక్కనే రూ.6 కోట్లతో నూతన రైతుబజార్ నిర్మించన ున్నాం. త్వరలోనే టెండర్లు పిలిచి, కాం ట్రాక్టర్ అగ్రిమెంట్ కాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తాం. రైతులు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. - రఘునాథరెడ్డి, డీఈఈ