వైభవంగా అంజన్న రథోత్సవం
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:22 AM
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని పట్టణ శివారులోని కొండల్లో వెలసిన రణ మండల ఆంజనేయ స్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది.
భారీగా తరలివచ్చిన భక్తులు
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : శ్రావణమాసాన్ని పురస్కరించుకుని పట్టణ శివారులోని కొండల్లో వెలసిన రణ మండల ఆంజనేయ స్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. 30 రోజులపాటు రణ మండల కొండల్లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం సింధూర సేవ, అలంకరణ, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయుడి భారీ రథోత్సవాన్ని ఆలయ కమిటీ చైర్మన్ టీజీ పాండురంగ, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బసవన్న గౌడ్, ఎగ్గాటి ప్రతాప్, దేవిశెట్టి ప్రకాష్, నీలకంఠ, నాగరాజు గౌడ్, మారుతీరావు ప్రారంభించారు. రథోత్సవం పట్టణంలోని సాయిబాబా విగ్రహం నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా భీమా సర్కిల్, శ్రీనివాస్ భవన్ నుంచి తిరిగి సాయిబాబా గుడికి చేరుకుంది. అంజనే యుడి మాల ధారణ స్వాములు హనుమాన్ నామస్మ రణంతో ముందుకు సాగారు.