Share News

పనుల జాప్యంపై ఆగ్రహం

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:42 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్‌ స్పెసాలిటీ బ్లాక్‌లో కొనసాగుతున్న యురాలజీ, న్యూరోసర్జరీ ఆపరేషన్‌ థియేటర్‌ పనుల జాప్యంపై ఏపీఎంఎ్‌సఐసీడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌పై కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనుల జాప్యంపై ఆగ్రహం
ఈఎన్‌టీ ఓపీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఏ.సిరి

కాంట్రాక్టర్‌ను నిలదీసిన కలెక్టర్‌

జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్‌ స్పెసాలిటీ బ్లాక్‌లో కొనసాగుతున్న యురాలజీ, న్యూరోసర్జరీ ఆపరేషన్‌ థియేటర్‌ పనుల జాప్యంపై ఏపీఎంఎ్‌సఐసీడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌పై కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కర్నూలు జీజీహెచ్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ఓపీ కేంద్రాలతో పాటు వార్డుల్లో కలియ తిరిగారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడే సమయంలో వైద్యులు సిబ్బందిని దగ్గరకు రానీయకుండా కలెక్టరే వారి దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు వస్తున్నారా? బాగా చూస్తున్నారా.. ఏ ఆరోగ్య సమస్యతో వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేశారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని న్యూరోసర్జరీ, కార్డియాలజీ విభాగాలను పరిశీలించారు. యురాలజీ, న్యూరోసర్జరీ ఆపరేషన్‌ థియేటర్‌ పనులను పరిశీలించి ఏపీఎంఎ్‌సఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారంటూ మండిపడ్డారు. బూత్‌ బంగ్లాలోని వార్డులను కలెక్టర్‌ పరిశీలించారు. ఇన్ని వార్డులకు నాలుగు బాత్‌రూమ్‌లా ఇందులో మహిళలు ఎలా వెళ్తారు.. తలుపులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రంలోపు బాత్‌రూమ్‌లకు తలుపులు ఏర్పాటు చేయాలని ఇంజనీర్‌ చిరంజీవులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇంజనీర్‌ అఽధికారులు సాయంత్రం తలుపులు ఏర్పాటు చేశా రు. కలెక్టర్‌ వెంట జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌, ఇన్‌చార్జి సీఎ్‌సఆర్‌ఎంవో వెంకటరమన, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో డా.పద్మజ, అడ్మినిస్ర్టేటర్‌ సింధూ సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ ఏడీ మల్లేశ్వరమ్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:42 PM