ఆందోళనలో అంగన్‌వాడీలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:53 PM
కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ను దిగ్బంధం చేశారు.
కనీస వేతనాల కోసం కలెక్టరేట్ దిగ్బంధం
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ను దిగ్బంధం చేశారు. శుక్రవారం అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి. నిర్మల, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లలిత, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీస వేతనం రూ.26వేలు పెంచాలని, జిల్లాలో ఉద్దేశపూర్వకంగా తొలగించిన ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేవారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి వెంకటమ్మ, జిల్లా అధ్యక్షురాలు బాలదుర్గమ్మ, ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు అంజి, రమీజాబీ, నాయకురాలు పాల్గొన్నారు.