Share News

అంగన్‌వాడీలా

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:21 AM

మండలంలో 11 గ్రామాలు ఉండగా, 39 అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 13 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా మరో 12 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.

అంగన్‌వాడీలా
అర్థాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం

ఆగిపోయిన భవన నిర్మాణాలు

పలుచోట్ల పాఠశాలు, అద్దె భవనాల్లో నిర్వహణ

మద్దికెర, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో 11 గ్రామాలు ఉండగా, 39 అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 13 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా మరో 12 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 14 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగున్నాయి. కాగా మద్దికెర, ఎం.అగ్రహారం, బురుజుల గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో భవనాల నిర్మాణాన్ని ప్రారంభిం చారు. అయితే అవి మధ్యలోనే నిలిచిపో యాయి. మరో 8 కేంద్రాలకు నిధులు ఉన్నా స్థలం లేక పనులు మొదలు కాలేదు. పాఠశాల భవనాలు, అద్దె గృహాల్లో కొనసాగుతున్న కేంద్రా ల్లో వసతులు లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఐసీడీఎస్‌ అధికా రులు పట్టించుకోక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ త్రివేణి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు మధ్యలో నిలిచిపోయాయనీ, మరికొన్ని చోట్ల స్థలం కొరత ఉందని తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 12:21 AM