సమ సమాజ నిర్మాణమే అంబేడ్కర్ ఆశయం
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:42 PM
సమ సమాజ నిర్మాణమే అంబేడ్కర్ ఆశయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సమ సమాజ నిర్మాణమే అంబేడ్కర్ ఆశయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ సమాన వైద్యం, విద్య, భావప్రకటన, సమన్యాయం పొందేందుకు రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ఆయన చూపిన బాటలోనే కూటమి ప్రభుత్వం బడుగువర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలంటే రాజ్యాంగ విలువలకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీదేవి, నాగార్జున, మార్కెట్‌యార్డు డైరెక్టర్ సుమలత, మిద్దె హౌసేని, రంగప్రసాద్ పాల్గొన్నారు.