Share News

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:19 AM

రాజ్యాంగ నిర్మాత, గొప్ప మేధావి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ అని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కొనియాడారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌
నివాళి అర్పిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగాన పల్లె, ఏప్రిల్‌ 14 ( ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత, గొప్ప మేధావి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ అని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కొనియాడారు. సోమవారం బనగానపల్లె పట్టణంలోని అవుకు మెట్టవద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి, దళితులకు అందించిన సేవలను మరువలేమన్నారు. అంబేడ్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి ఆయన జయంతి రోజును సెలవుదినంగా ప్రకటించిందన్నారు. టీడీపీ ఆది నుంచి దళితులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. దళితులైన సీఎంసి బాలయోగి, ప్రతిభాభారతి, వంగలపూడి అనిత వంటి వారికి ఉన్నతపదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ టీడీపీ అన్నారు. అంబేడ్కర్‌ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప యోధుడన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, కాశీంబాబు, కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, కాశీంభాష, సలాం, పూలకలాం, నియాజ్‌, అహ్మద్‌హుసేన్‌, భూషన్న మంగంపేట శ్రీ.ను ఎంపీడీవో రమణ, ఏఈ సాయికృష్ణ, వెంకటేశ్వరరావు, రాందాసురెడ్డి, బిజెపీ నాయకుడు శివకృష్ణ, అధిక సంఖ్యలో టీడీపీ దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:19 AM