భయం భయంగా విధులు
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:56 AM
తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. భవనం బ్రిటీష్ కాలంలో నిర్మించిది కావడతో శిథిలావస్థకు చేరింది.
శిథిలావస్థలో ఆలూరు తహసీల్దార్ కార్యాలయం
ఆలూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. భవనం బ్రిటీష్ కాలంలో నిర్మించిది కావడతో శిథిలావస్థకు చేరింది. పైకప్పు నుంచి వర్షపునీరు లీకేజీ కావడంతో సిబ్బంది బక్కెట్లను ఏర్పాటు చేశారు. స్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో సపోర్ట్‌గా పెద్ద దూలాన్ని ఏర్పాటు చేశారు. అ భవనంలో పనిచేయలేమని ఉద్యోగులు అప్పటి ఆర్డీవో రామలక్మి దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్వయంగా పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలోకి మార్పు చేయాలని సూచించగా, చిన్నదిగా ఉండటంతో రికార్డులు ఉంచేందుకు అణువుగా లేదని రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపలేదు. అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని ఉద్యోగులు కోరుతున్నారు.