‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:55 AM
కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది. శుక్రవారం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేం దుకు సర్వం సిద్ధంచేశారు
కర్నూలు జిల్లాలో 231 బస్సుల్లో సౌకర్యం
25 వేలకు పైగా మహిళలు ఉపయోగించుకునే అవకాశం
సన్నాహాలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు
నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది. శుక్రవారం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేం దుకు సర్వం సిద్ధంచేశారు. మహిళలకు జీరో చార్జీ టికెట్ ఇస్తారు. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఆర్టీసీ అధికారులు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 5గంటల తరువాత ఈసౌకర్యం అందుబాటులోకి రానుంది. జిల్లాలో దాదాపుగా 25 వేల మందికి పైగా మహిళలు రోజు ఉచిత ప్రయాణం సౌకర్యం పొందే అవకాశముందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ర్టా పల్లెవెలుగు బస్సులు 231
జిల్లాలో కర్నూలు-1, 2, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ఆర్టీసీ డిపోల పరిధిలో పల్లె వెలుగు నుంచి హైటెక్ సర్వీస్ వరకు వివిధ బస్సులు 390 ఉన్నాయి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అలా్ట్ర పల్లెవెలుగు బస్సులు 270 ఉన్నాయి. వీటిలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాల యం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లోని అన్ని రూట్లలో వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అలా్ట్ర పల్లెవెలుగు 231 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నాన్‌స్టాప్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. జిల్లాలో నాన్ స్టాప్ బస్సులను సింగిల్, టూ, త్రీ స్టాప్ బస్సులుగా మార్చాడంతో వాటిలో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తారు. దీంతో సూపర్ లగ్జరీ, అలా్ట్ర డిలక్స్, హైటెక్ వంటి బస్సుల మినహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎలాంటి చార్జి చెల్లించకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
ఆ సర్వీస్‌ల్లో ఉచితం లేదు
అంతర్రాష్ట్ర, ఘాట్ రూట్లలో నడిపే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదు. కర్నూలు- బళ్లారి వయా ఎమ్మిగనూరు, ఆదోని సర్వీస్ 6 బస్సులు, ఎమ్మిగనూరు-బళ్లారి వయా ఆదోని, ఆలూరు సర్వీస్ 6 బస్సులు, ఎమ్మిగనూరు, ఆదోని నుంచి బెంగళూరు వెళ్లే 5, హైదరాబాద్‌కు వెళ్లే ఒక బస్సు సహా కర్ణాటకలోని సిరుగుప్ప, తెలంగాణ రాష్ట్రంలోని ఐజ, ఘాట్ రూట్ శ్రీశైలానికి నడిపే 39 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణానికి సర్వం సిద్ధం చేశాం. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాటుచేశాం. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. టిమ్స్‌లో ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేశాం. - శ్రీనివాసులు, ఆర్‌ఎం, ఏపీఎస్ ఆర్టీసీ, కర్నూలు