కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:30 PM
భారతదేశంలో కమ్యూనిస్టులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
నంద్యాల రూరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : భారతదేశంలో కమ్యూనిస్టులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శని వారం పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకా నంద ఆడిటోరియంలో కమ్యూనిస్టుల ఐక్యత-నేటి ఆవశ్యకత అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాం గాన్ని మనుస్మృతిగా మార్చాలని చూస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తుల పతనానికి కమ్యూనిస్టుల ఐక్యతే పునాది కావాలన్నారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులేనన్నారు. మోదీ పాలనలో దేశంలో రూపాయి విలువ పడిపోగా, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమ ర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజ నేయులు, రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ లకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు మూడో శక్తిగా ఎదగాల్సిన సమయం ఆస న్నమైందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌కుమార్, సీపీఎం సీనియర్ నాయకుడు శంకరయ్య, ఉమ్మడి జిల్లా సీపీఐ సీనియర్ నాయకుడు మనోహర్ మాణిక్యం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు.