పౌరులందరూ ఓటు హక్కును పొందాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:03 AM
పౌరులందరూ ఓటు హక్కును పొందాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.
కర్నూలు నియోజకవర్గ ఆర్వో విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి):పౌరులందరూ ఓటు హక్కును పొందాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. గురువారం నగర పాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమా వేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణలో భాగంగా ఫారం 6, 7, 8లను వినియోగించుకోవాలని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు మార్గనిర్ధేశం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా రాజకీయ పార్టీలతో 8 సమావేశాలు నిర్వహించి, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరితగతిన బూత ఏజెంట్ల జాబితాను సమర్పించాలన్నారు. సమావేశంలో అర్బన తహసీల్దారు రవికుమార్, డి ప్యూటీ తహసీల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న పాల్గొన్నారు.